Header Banner

కేవీఎస్‌ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు ఎలా చేయాలి? ఎవరికి మొదటి ప్రాధాన్యం?

  Fri Mar 07, 2025 18:20        Education

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. అర్హత ఉన్న వారు ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం చొప్పున సీట్ల రిజర్వేషన్‌ ఉంటుంది.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


అన్ని కేంద్రీయ విద్యాలయాలకు ఇది వర్తిస్తుంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్ధులకు మార్చి 31 నాటికి వయసు 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతి ప్రవేశానికి 7-9 ఏళ్ల మధ్య, మూడు, నాలుగో తరగతులకు 8-10, 5వ తరగతికి 9-11, ఆరుకు 10-12, 7వ తరగతికి 11-13, 8వ తరగతికి 12-14, 9వ తరగతికి 13-15, 10వ తరగతికి 14-16 ఏళ్ల మధ్య నిర్దేశించిన మేరకు తప్పనిసరిగా వయోపరిమితి ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఒక్కో కేంద్రీయ విద్యాలయలో తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 40 చొప్పున సీట్లు ఉంటాయి. రెండు సెక్షన్లు ఉండటంతో ప్రతి కేంద్రీయ విద్యాలయలో ఒక్కో తరగతికి 80 మందికి ప్రవేశం అవకాశం ఉంటుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
ఒకటో తరగతి ప్రవేశాలు ఆన్‌లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారు. రెండు నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే మాత్రం లాటరీ సిస్టం ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం ప్రవేశ పరీక్ష ఉంటుంది. 11వ తరగతిలో ప్రవేశాలకు పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో మిగిలిన సీట్లు ఉంటేనే ప్రవేశాలు ఉంటాయి. ఇక 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను వెల్లడిస్తారు. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇక రెండు ఆపై తరగతులకు మాత్రం ఆఫ్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అంటే ఆయా కేంద్రీయ విద్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #kvv #admission #entrance #todaynews #flashnews #latestnews